ఇక ఇప్పటి వరకూ గరికపాటి గారు ప్రధానంగా భార్యాభర్తల మధ్య అనుబంధం, పిల్లల పెంపకం, జీవన విధానం వంటి విషయాలపై మాత్రమే సలహాలు ఇస్తూ వచ్చారు. కానీ ఈసారి ఆయన ఒక ప్రత్యేకమైన సినిమా గురించే సలహా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సినిమా “ఎనిమిది వసంతాలు”. అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రేమకథా చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెద్దగా ప్రమోషన్ లేకపోవడం వల్ల చాలామంది ఈ సినిమాని ఇంకా చూడలేదు. ఈ నేపథ్యంలో గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
ఆయన మాట్లాడుతూ .. “నేను ఈ సినిమా చూశాను. ఈ సినిమా చూస్తే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలుస్తుంది. ప్రేమ అనేది కేవలం శారీరక సౌఖ్యం కాదు. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు పరస్పర గౌరవం కలిగి ఉండడమే అసలు ప్రేమ. గొప్పలు చెప్పుకోవడం కాదు, నిజమైన ప్రేమ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. కలిసి ఉన్నా, విడిపోయినా ప్రేమికులు ఎప్పుడూ ఒకరికి ఒకరు సంతోషం కోరుకోవడమే నిజమైన ప్రేమ” అని తెలిపారు. అదే విధంగా గరికపాటి గారు ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని సూచించారు. ఆయనలాంటి ఆధ్యాత్మిక వేత్త ఒక ప్రేమకథా సినిమాని ఇంతలా మెచ్చుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అనేక మంది యువత ఈ వ్యాఖ్యలను షేర్ చేస్తూ, “గరికపాటి మనసును తాకేలా చేసిందంటే, ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది” అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ సినిమాను ఇప్పుడు తప్పకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద, గరికపాటి నరసింహారావు గారి ఈ వ్యాఖ్యలు “ఎనిమిది వసంతాలు” సినిమాకు అద్భుతమైన ప్రమోషన్‌గా మారాయి. సాధారణంగా సినిమాలపై తన అభిప్రాయాలను బయట పెట్టని ఆయన ఈసారి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో, ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సంఘటన మరోసారి గరికపాటి గారి మాటలకు ఉన్న శక్తిని, ప్రభావాన్ని నిరూపించింది.