ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లో ఎంతటి హీటెక్కించే వాతావరణం నడుస్తుందో ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ , సెలబ్రిటీల మధ్య మాటల యుద్ధంతో పాటు గొడవలు వంటివి తరచూ జరుగుతున్నాయి. మొదటి వీక్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ శర్మ ఎలిమినేట్ అవ్వగా..ఈసారి ఎవరు అవుతారనే విషయంపై చాలా ఎక్సైటింగ్ గా చేశారు. ఈసారి ఎలిమినేషన్ లో మొత్తం 7 మంది ఉన్నారు.


సుమన్ శెట్టి, భరణి, హరీష్, ఫ్లోరా సైని , పవన్, ప్రియ, మనీష్ అయితే గత వారంలో లాగే ఈవారం కూడా ఓటింగ్లో మాత్రం సుమన్ శెట్టి టాప్ లోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానాలలో భరణి, ఫ్లోరా సైని, పవన్. అయితే చివరి మూడు స్థానాలలో మనీష్, హరీష్, ప్రియ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రియకు తక్కువ ఓటింగ్ ఉండడంతో  కచ్చితంగా ప్రియ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ చివరి రోజు అయిన శుక్రవారం ప్రియకు భారీగానే ఓట్లు పడ్డాయి. ఈ ఓటింగ్ ఎఫెక్ట్ మనీష్ ఎలిమినేట్  అయినట్లుగా  సమాచారం. మనీష్ కి రెండు వారాలకు గాను రూ .1,40,000 వేల రూపాయలు ఇచ్చినట్లు వినిపిస్తున్నాయి. అంటే వారానికి రూ .70 వేల రూపాయలు అన్నమాట.


సామాన్యులలో చివరిగా మనీష్ వచ్చారు.. కానీ ఇప్పుడు వేగంగా ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం అంత గుడ్డు దొంగతనం అంటూ బోర్ కొట్టించినప్పటికీ రెండో వారంలో హరీష్ గురించి హాట్ టాపిక్ గా మారింది. అలాగే రీతూ చౌదరి లవ్ ట్రాక్ కూడా కొంత ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. సామాన్యుల నుంచి పవన్ కెప్టెన్ అయినప్పటికీ.. కానీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కెప్టెన్సీ నుంచి తీసివేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: