ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒకే మాట వినిపించింది – “తేజ సజ్జా కి ఎదురుగా పెద్ద అడ్డంకులు వస్తాయి, ఓవర్ హైప్ ఎక్కువ అవుతుంది, చివరికి భారీ షాక్ తప్పదు” అని. కొందరు నెటిజన్లు ఈ విషయంలో వరుసగా ట్రోలింగ్ చేయగా, కొంతమంది సినీ ప్రముఖులు కూడా పరోక్షంగా తేజను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వారంతా చెప్పినట్టే నిజం అయ్యిందనే టాక్ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.ఇటీవల తేజ సజ్జా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. “మిరాయి ” సినిమాతో అతను క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఆయనను “నెక్ట్స్ పాన్ ఇండియా హీరో” అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇండస్ట్రీలో కొత్తగా ఎదుగుతున్న యువ హీరోలతో పోల్చితే తేజ సజ్జా తనదైన స్టైల్‌తో, స్లో అండ్ స్టెడీగా ముందుకు వెళ్తూ పెద్ద విజయం సాధించాడు.

తేజ సజ్జా చిన్నప్పటి నుంచే ప్రేక్షకులకు పరిచయం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆయన చేసిన పనితనం మరచిపోలేని స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా “ఇంద్ర” సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఇంకా చాలామందికి గుర్తుండిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ తో చేసిన “బాలు” సినిమాలో ఆయన నటించిన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అనిపించింది. ఆ అనుభవాలన్నీ ఆయన కెరీర్‌కు బలమైన ఫౌండేషన్ అయ్యాయి.హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత “మిరాయి” సినిమా అతనికి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమాతోనే ఆయన పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ విజయంతో తేజ సజ్జా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కొందరు నెటిజన్లు మరీ ఎక్కువగా హైప్ చేయడంతో “ఇతర హీరోలు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటారు, కానీ తేజ మాత్రం హిట్ కొడుతూ సింపుల్‌గా వెళ్తున్నాడు” అన్న చర్చలు మొదలయ్యాయి.

అంతలోనే మరో సెన్సేషనల్ న్యూస్ బయటికి వచ్చింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో తేజ సజ్జా ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడని వార్త హల్చల్ చేసింది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందని వచ్చిన వార్త తేజ అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. కానీ, ఇప్పుడు షాకింగ్ అప్డేట్ బయటకొచ్చింది.తెలుసుకుంటే, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోయిందట. కారణం మాత్రం స్పష్టంగా తెలియకపోయినా, “కాల్ షీట్ అడ్జస్ట్ సమస్యల వల్లే సినిమా ఆగిపోయింది” అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇది కావాలని కొన్ని వర్గాలు ప్లాన్ చేసుకున్న కుట్ర అని తేజ అభిమానులు ఆరోపిస్తున్నారు. “తేజ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్ట్‌ను ఆపేశారు” అనే మాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ వార్త నిజమా..? కాదా..? అన్నది ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద దుమారం రేపుతోంది. తేజ అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే అప్డేట్‌గా మారింది. ఆయన పాన్ ఇండియా లెవెల్‌లో మోమెంటం అందుకున్న టైంలో ఇలాంటి షాక్ రావడం బాధాకరం. కానీ తేజ సజ్జా పట్టుదల, టాలెంట్ చూసినప్పుడు ఆయన ఇంకా పెద్ద ప్రాజెక్ట్‌లు సాధించడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: