కన్నడ సినీ పరిశ్రమ నుంచి అతి చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ తో ఒక ప్రభంజనం సృష్టించిన చిత్రం కాంతార. కేవలం ఈ సినిమాను రూ.15 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కించగా రూ .400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇందులో హీరోగా రిషబ్ శెట్టి నటించగా.. తన స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా కాంతార చాప్టర్-1 పేరిట సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.




ట్రైలర్ విషయానికి వస్తే.. "నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యారు" అనే డైలాగుతో మొదలవుతుంది. ఆ వెంటనే పంజుర్లి అవతారంలో హీరో కనిపిస్తూ ట్రైలర్ మొదలవుతుంది.. ఇందులో రిషబ్ శెట్టి  అద్భుతమైన లుక్ లో కనిపించారు. ఈ సినిమాకి ఉపయోగించిన గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. బిజిఎంతో పాటు డైలాగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ప్రతి సన్నివేశం కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.రుక్మిణి వసంత్ కూడా ఇందులో చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తోంది.



విలన్ పాత్రలో గుల్హన్ దేవయ్య అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అనేది 2022లో విడుదలైన కాంతార భాగంలో చాలా సింపుల్ డ్రామా తో చూపించారు. ప్రీక్వెల్లో.. రాజుల యుద్ధాలు,  రాకుమారితో హీరో ప్రేమాయణం వంటి సన్నివేశాలను చూపించినట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ తోనే మంచి హైప్ తీసుకువచ్చిన రిషబ్ శెట్టి మరి ఈ సినిమాతో  ఏ విధంగా ఆకట్టుకునేలా చేస్తారో తెలియాలి అంటే అక్టోబర్ 2 వ తేదీ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: