బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చి ప్రేమో చెప్పనక్కర్లేదు. అలాంటి బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యణ్ కి వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు బండ్ల గణేష్ కి ఇచ్చినంత ప్రియారిటి పవన్ మరొకరికి ఇవ్వక పోయేవారు. కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని పట్టించుకోకపోవడంతో కాస్త నిరాశ అసహనంతో బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కి కౌంటర్లు వేస్తూ చురకలు అంటిస్తున్నారు.ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి తనకి మధ్య కొంతమంది పుల్లలు పెడుతున్నారు అన్నట్లుగా మాట్లాడి పవన్ తో తననికి విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు.

ఇందులో బండ్ల గణేష్ అన్నది త్రివిక్రమ్ నే అని చాలామంది భావించారు. త్రివిక్రమ్ వల్లే బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నారని చాలామంది మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓజి మూవీ విడుదల వేళ మరోసారి సంచలన ట్వీట్ పెట్టారు బండ్ల గణేష్.. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో "కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావు అనేది చూడరు.. నీవు చేయలేనిది మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తి పరచలేవు" అంటూ ట్వీట్ పెట్టాడు. అయితే ఈ ట్వీట్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే పెట్టారంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.దానికి కారణం పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో తన సినిమా ఈవెంట్లకి బండ్ల గణేష్ ని ఆహ్వానించడం లేదు.

రీసెంట్ గా జరిగిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బండ్ల గణేష్ ని ఆహ్వానించలేదనే కోపంతో బండ్లన్న ఈ విధంగా ట్వీట్ పెట్టారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ ఈవెంట్లో అయినా బండ్ల గణేష్ ఉండేవారు.అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ పూర్తిగా దూరం పెట్టడంతో ఆయన కాస్త అసహనానికి గురివుతున్నారు. అంతేకాదు చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ ని ఎవరైనా అంటే బండ్ల గణేష్ ఊరుకునే వాడు కాదు.వారందరికీ కౌంటర్లు ఇచ్చేవాడు.అలాంటిది ఇప్పుడు బండ్ల గణేష్ నేరుగా పవన్ కళ్యాణ్ కి చురకలు అంటించడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: