భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన 'బాహుబలి' ప్రపంచం గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో, అందులో కట్టప్ప పాత్ర అంతకు మించి ప్రేక్షకుల్లో ముద్ర వేసింది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ఒకే ఒక్క ప్రశ్న... రెండో భాగంపై దేశవ్యాప్తంగా అంచనాలను, ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చింది. బాహుబలి, భల్లాలదేవ పాత్రల పక్కన కట్టప్ప కూడా అంతే స్థాయిలో జనాల నోళ్లలో నాని, సినిమాకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు, ఈ పాత్రపై దృష్టి పెట్టింది ఆ టీమ్. బాహుబలి సృష్టికర్తలు, కథా రచయిత విజయేంద్రప్రసాద్ మరియు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కట్టప్ప పాత్రతో ఒక స్పెషల్ సినిమా (ప్రీక్వెల్) చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 

ఈ వార్త బాహుబలి అభిమానుల్లో, ముఖ్యంగా కట్టప్ప పాత్రను ప్రేమించిన ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తోంది. కట్టప్ప వెనుక దాగి ఉన్న చరిత్ర! :ఈ కొత్త సినిమా కథాంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప ఎందుకు నమ్మిన బంటుగా, బానిసగా ఉండాల్సి వచ్చింది? అతని నేపథ్యం ఏంటి? అతని కుటుంబ చరిత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం దొరికే విధంగా ఈ సినిమా కథ అల్లబోతున్నారు. మాహిష్మతికి దాస్యంలో కట్టప్ప కుటుంబం ఎలా చిక్కుకుంది, అతని వీరత్వం, విధేయతకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనే అంశాల చుట్టూ కథనం సాగనుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయంలో మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.



 రాజమౌళి స్వయంగా డైరెక్ట్ చేస్తారా, లేక వేరే మరొక టాలెంటెడ్ డైరెక్టర్‌కి ఈ బాధ్యతలు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై టీమ్ అత్యంత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కట్టప్ప ప్రీ-విజువలైజేషన్ (కథ, పాత్రల రూపకల్పన) వర్క్ మొదలైనట్లు సమాచారం. త్వరలోనే ఈ సంచలన ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. కట్టప్ప పాత్ర వెనుక దాగి ఉన్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్తతో బాహుబలి ఫ్రాంఛైజీపై ఉన్న అంచనాలు మరోసారి ఆకాశాన్ని తాకడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: