ఓజి అనేది కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, కోట్లాదిమంది ప్రజలకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఇది ఒక ఎమోషన్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్‌లో ఉత్సాహం, ఆనందం, గర్వం వర్ణించలేనంత స్థాయిలో పెరిగిపోయింది. పవర్ స్టార్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త స్టైల్‌లో చూసిన అభిమానులు థియేటర్లలోనే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. “ఇలాంటి పవన్ కళ్యాణ్‌ని మేము ఎప్పుడూ చూడలేదు” అంటూ గట్టిగా కేకలు వేస్తూ, గొంతు చించుకుని థ్యాంక్స్ చెబుతున్నారు.ఈ అద్భుతమైన స్పందనకు ప్రధాన కారణం సినిమా కంటెంట్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్.

ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పవన్ కళ్యాణ్‌తో జోడీగా బాగా నచ్చారు. ఓజి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తూ, కలెక్షన్స్ పరంగా రికార్డులను తుడిచిపెట్టేస్తూ దూసుకుపోతోంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో సాధించిన వసూళ్లు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్కడ టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ సినిమాలతో రికార్డులు సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రభాస్ బాహుబలి, రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలు ఇక్కడ అద్భుతమైన వసూళ్లు సాధించాయి. బాహుబలి ఓపెనింగ్ డేలో 5.94 కోట్ల షేర్ వసూలు చేసి టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ 5.3 కోట్ల షేర్, అలాగే పలు స్టార్ హీరో సినిమాలు 4-5 కోట్ల రేంజ్‌లో వసూళ్లు సాధించాయి.

కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన ఓజి అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. రిలీజ్ మొదటి రోజే ఈస్ట్ గోదావరిలో ఏకంగా 8.24 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్‌గా దాదాపు 16 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇది ఇంతవరకు ఎవరూ సాధించని ఘనత. ఈ సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ సినిమా బాహుబలి, ఆర్ఆరార్ రికార్డ్స్ ని తుక్కు తుక్కు చేసి పెట్టిన్నట్లైంది. ఇదే విషయాని ఫ్యాన్స్ ఫుల్ హంగామ చేస్తూ చెప్తున్నారు..!!




మరింత సమాచారం తెలుసుకోండి: