తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఈ సంవత్సరం అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన ఇండియన్ మూవీ లలో సూపర్ సాలిడ్ ప్లేస్ లో నిలిచింది. కానీ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన కూలీ సినిమాను మాత్రం క్రాస్ చేయలేకపోయింది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో రూపొందిన కూలీ మూవీ కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 151.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన ఇండియన్ మూవీస్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 145 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ మూవీలలో రెండవ స్థానంలో నిలిచింది. ఇలా మొదటి రోజు ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన కూలీ సినిమాను మాత్రం దాటలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk