
తేజ తనకంటే వయసులో చిన్నవాడు, నా తమ్ముడు లాంటోడు.. గడిచిన మూడు నాలుగేళ్ల వరకు మనోడి ముఖంలో పసితనం ఛాయలు ఇంకా పోలేదు.. తాను తేజను చూస్తే బుగ్గలు పట్టుకొని మరి ముద్దు చేసేవాడిని.. తనని ఎప్పుడు చూసినా నా కొడుకుగా భావించాను..అప్పుడు మాట ఇచ్చినదే ఇప్పుడు తేజ కోసమే సినిమాలో నటించానని తెలిపారు. తేజ సజ్జా కు, తనకు ఎందుకు గొడవలు ఉన్నాయి అనుకుంటున్నారంటే.. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక్కడే వెళ్లడం వల్లే ఇదంతా జరిగింది ,అలా ఏం లేదు నేను మరోవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నానని తెలిపారు మనోజ్.
మేము బాగానే ఉన్నాం.. మీరు అనుకున్నట్లుగా మా మధ్య ఎలాంటి గొడవలు లేవు.. తనపై నాకు మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది కాబట్టే తనని అంత దగ్గరగా తీసుకుంటాను ఒకవేళ నాకు తన పైన ఏదైనా ఉంది అంటే వెంటనే వాళ్లకు తెలిసిపోతుంది అంటు తెలిపారు మనోజ్. నిర్మాత విశ్వప్రసాద్ కూడా సినిమా మొదలు పెట్టడానికి ముందే తనకు అన్ని క్లారిటీగా చెప్పేసారని.. తేజ సజ్జా కూడా అందుకు అందుకు ఒప్పుకొని ప్లాన్ చేసుకున్నారని.. అలా సినిమా విడుదలైన తర్వాత కూడా వారి ప్లాన్ ప్రకారమే వెళ్లారు. వాళ్లకు ఒక క్లారిటీ ఉంది.. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ ఓపెన్ గా చెప్పేశారు మనోజ్.