
తన 25 ఏళ్ల కెరియర్లో కేవలం నటించింది 40 సినిమాలలో మాత్రమే. అయితే ఈమె నటించే ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన పాత్రలలోనే నటించింది. తాజా ఇంటర్వ్యూలో అమీషా మాట్లాడుతూ హాలీవుడ్ స్టార్ "టామ్ క్రూజ్" పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఇతడు అంటే నాకు చాలా క్రష్ అంటూ డైరెక్ట్ గానే చెప్పేసింది. చిన్న వయసులో నుంచే అతడు అంటే పిచ్చి..నా గదిలోనే కాకుండా ,నా పెన్సిల్ బాక్స్ లలో కూడా ఇతడి ఫోటోలు ఉండేవని.. అతడిని చూసినప్పుడు నా జీవితంలో రూల్స్ అన్ని పక్కనే పెట్టాల్సి వస్తుందని తెలిపింది.. ఒకరోజు ఆయనతో రాత్రి గడపగలరా అని యాంకర్ అడిగగా?.. ఆమె ఎలాంటి సందేహం లేకుండానే సరే అని ఫన్నీగా కామెంట్స్ చేసింది.
కానీ అమీషా పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. 50 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఇప్పటికీ అమీషా పటేల్ వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంది. అప్పుడప్పుడు వివాహానికి సంబంధించి పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇమే చేసిన వ్యాఖ్యల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం హాట్ గ్లామర్ ఫోటోలతోనే హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది అమీషా పటేల్.