
కానీ తాజాగా సాయి పల్లవి ఈ రూమర్స్‌పై ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో ట్రిప్‌కి సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేస్తూ, “ఇవి అన్నీ నా ఒరిజినల్ ఫోటోలు, ఏవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినవి కావు” అని ప్రత్యేకంగా క్యాప్షన్ జోడించింది. ఇలా చేయడం ద్వారా బికినీ ఫోటోలు నిజమని అనుకునే వారికీ, అవి ఫేక్ ఫొటోలని చెప్పే వారికీ తనదైన స్టైల్‌లో ఘాటు రియాక్షన్ ఇచ్చినట్టే అయ్యింది. ఎందుకంటే ఈ పిక్స్ లో ఆమె బికినీ వేసుకున్న ఫోటోస్ లేవు. దీంతో అందరి నోర్లు మూయించింది ఈ సాయిపల్లవి.
సాయి పల్లవి షేర్ చేసిన వీడియోల్లో ఎక్కడా బికినీ ఫోటోలు కనిపించకపోవడంతో, ఇప్పటివరకు వైరల్ అయిన అవి ఫేక్ ఫోటోలు అన్న స్పష్టత వచ్చింది. అంటే, సాయి పల్లవి ఎప్పటిలాగే తన ట్రెడిషనల్, డీసెంట్ ఇమేజ్‌నే కొనసాగిస్తోందని చెప్పకనే చెప్పేసింది. దీంతో సాయి పల్లవి బికినీ ధరించలేదు అన్న విషయం ఫ్యాన్స్‌కి క్లియర్ అయిపోయింది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసిన వారంతా ఇప్పుడు ఘాటుగా కౌంటర్ అవుతున్నారు. మరోవైపు, సాయి పల్లవి పెట్టిన ఈ పోస్ట్, వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మరోకసారి సాయిపల్లవి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ప్రజెంట్ సాయి పల్లవి బాలీవుడ్ లో ఒక సినిమా కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..!