కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్ళినట్లయితే స్టార్ హీరోల నటించిన సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మొదటి వారం రోజుల పాటు పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్లు వచ్చేవి. అదే సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినట్లయితే దాదాపు రెండు వారాల పాటు మంచి కలెక్షన్లు వచ్చేవి. ఇక హిట్టు టాకు వచ్చిన సినిమాలకైతే దాదాపు నెల రోజుల పాటు మంచి కలెక్షన్లు వస్తూ ఉండేవి. ఇలా చాలా రోజుల పాటు మంచి కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం ఆ సమయంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా తక్కువ టికెట్ ధరలు ఉండడమే అని చాలా మంది అభిప్రాయం. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలకు కూడా తక్కువ టికెట్ ధరలు ఉండడంతో కుటుంబం అంతా కలిసి సినిమాలు చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉండేది.

దానితో చాలా రోజుల పాటు స్టార్ హీరోలు నటించిన సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తూ ఉండేవి. ఇకపోతే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మొదటి వీకెండ్ కంప్లీట్ అయ్యాక , మొదటి వీక్ డే స్టార్ట్ కాగానే భారీ ఎత్తున డ్రాప్స్ కనబడుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోలు నటించిన సినిమాలకు టికెట్ ధరలు అధికంగా ఉండటమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

టికెట్ ధరలు అధికంగా ఉండడంతో సినిమాను ఎవరైతే చూడాలి అని అత్యంత ఆసక్తితో ఉంటారో వారు మొదటి వీకెండ్ లోపే చూసేస్తున్నారు అని , ఆ తర్వాత వీక్ డే స్టార్ట్ అయ్యాక ఫ్యామిలీస్ ఆడియన్స్ స్ట్రెంత్ పెరగాలి. కానీ టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కు వచ్చి మరి సినిమా చూడడానికి ఆసక్తి చూపించడం లేదు అని , అందుకే స్టార్ హీరోలు నటించిన సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా చాలా తక్కువ సినిమాలకు మాత్రమే లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: