"నువ్వు పోతే నేను.. నేను పోతే వాడు.. వాడు పోతే నా అమ్మ మొగుడు అంటూ అధికారం కోసం ఎవరైనా ఎగబడితే ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు".. ఈ డైలాగ్  మనకు ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది కదా? ప్రభాస్ కెరీర్‌లోనే ఈ డైలాగ్‌ గుర్తించదగ్గదిగా నిలిచిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమాలో ఇది చాలా బోల్డ్‌గా, వైలెంట్‌గా చెప్పబడింది. ఈ డైలాగ్‌ ని ప్రేక్షకులు, అభిమానులు చాలా సందర్భాల్లో యూస్ చేశారు.  సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్‌గా మారింది. ఇక ఈ విషయాలను పక్కన పెట్టితే, ఒకరి తర్వాత మరొకరు, తర్వాత ఇంకొకరు—వీటివల్ల వారి కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు వరసగా కొనసాగుతూ, ఇండస్ట్రీలో కొత్తవారికి ఎదగడానికి అవకాశం తగ్గిస్తున్నారని చాలా కాలంగా వినిపిస్తున్నది. అయితే, కొంతమంది సినీ డైరెక్టర్స్ ఈ సమస్యను పెద్దగా పట్టించుకోకుండా, నిజమైన టాలెంట్‌ ఉన్న వారిని సపోర్ట్ చేస్తున్నారు.


ఇక్కడ ముఖ్యంగా సుకుమార్ పేరు వినిపిస్తుంది. సుకుమార్ మంచి డైరెక్టర్‌గా పేరు పొందారు. కాంట్రవర్సీల జోలికి అస్సలుపోడు. నెమ్మదిగా, నిదానంగా, ఆయన అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సన ఎంతో పెద్ద స్టార్‌గా ఎదిగారు. ఆయనను దర్శకుడిగా ప్రూవ్ చేసుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు.  సూర్య ప్రతాప్ పలనాటి అనే దర్శకుడు కూడా కుమారి 21 సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. ఈయన కూడా సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు ఈయన వల్ల ఇద్దరు  కొత్త స్టార్స్ ఇండస్ట్రీకు రాబోతున్నారని వార్తలు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.


అతని శిష్యుడైన వీర అనే కుర్రని దర్శకుడుగా పరిచయం చేస్తూ, సుకుమార్ రైటింగ్స్ నుండి ఒక సినిమా రాబోతుందని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయ్ అంటున్నారు మేక్రస్. కిరణ్ అబ్బవరం తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారట.  అలాగే, హేమంత్ అనే మరొక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని  సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది. అతను చెప్పిన డీసెంట్ లవ్ స్టోరీ సుకుమార్‌కి విపరీతంగా నచ్చిందట. అందుకే, ఆయనకు సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారట. సుకుమార్ బాగుపడడమే కాదు, నిజమైన టాలెంట్ ఉన్న వారిని కూడా ఎదిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. చూడాలి, సుకుమార్ తీసుకున్న నిర్ణయం ఆయన పేరును ఎంత హైలైట్ చేస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: