
గత ఆరేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ ప్రేమను సోషల్ మీడియా వేదికగా ఎప్పుడో బహిర్గతం చేసినప్పటికీ తాజాగా ఎట్టకేలకు ఈ జంట వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ముంబైలో అవికా గోర్, చాంద్వాని వివాహం చాలా గ్రాండ్ గా జరిగినట్లుగా ఆ వేడుకలకు సంబంధించి చాలామంది సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరైనట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లికి ముందే బయట మీడియాకు ఇచ్చిన సెలబ్రిటీల పోజులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు ,పలువురు నెటిజన్స్ సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2019లో మిలింద్ ను ఒక సందర్భంలో కలిసిన ఆవికా అప్పటినుంచి వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు వారి యొక్క అభిప్రాయాలు, మనసులు కలవడంతో 2020 నుంచి ప్రేమించుకున్నారు. అయితే తమ ప్రేమని పెళ్లితో మరింత ముందుకు తీసుకువెళ్లారు. ఆవికా గోర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం షణ్ముఖ అనే చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు మరో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. మరి వివాహం అనంతరం ఆవికా గోర్ సినిమాలలో నటిస్తుందో లేదో చూడాలి మరి.