పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజి” ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. విడుదలైన రోజు నుంచే ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లు రాబడుతూ, అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది హ‌య్య‌స్ట్ రికార్డ్‌. ఈ సినిమా విజ‌యంతో ప‌వ‌న్‌ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నారు.


తాజాగా హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్స్‌లో ఈ సినిమాని మెగా ఫ్యామిలీ సభ్యులు కలిసి వీక్షించడం మెగా అభిమానులకు పండుగలా మారింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్, నిర్మాత డివివి దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవి కే. చంద్రన్ మరియు ఇతర ముఖ్యులు ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. స్క్రీన్ ముందు మెగా కుటుంబం మొత్తం కలిసి క్లిక్ అవడం ఒక అద్భుతమైన ఫోటో మూమెంట్‌గా మారింది.


ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు. పవన్, చిరంజీవి, చరణ్ ఒకే ఫ్రేమ్‌లో ఉండటం ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. “ఓజి” క్రేజ్ ఇలాగే కొనసాగితే, వచ్చే రోజుల్లో 300 కోట్ల మార్క్ దాటడం ఖాయం అన్నట్టే కనిపిస్తోంది. అభిమానులు మాత్రం ఈ విజయాన్ని మెగా ఫ్యామిలీ కలసి సెలబ్రేట్ చేయడం మరింత స్పెష‌ల్ అనే చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: