టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత చందమామ, మగధీర, ఆర్య 2, బృందావనం, డార్లింగ్, నాయక్, ఎవడు, టెంపర్ తదితర చిత్రాలలో నటించి భారీ క్రేజీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో అందరి హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ. నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమించి మరి 2020 లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ సినిమాలకు గ్యాప్ తీసుకుని.. మళ్లీ పలు చిత్రాలలో నటిస్తోంది.


నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ అగర్వాల్ తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా తన అందాలను ఆరబోస్తూ యంగ్ హీరోయిన్ల తరహాలో దుస్తులు ధరించి మరి తన అందాలతో యూత్ ను మరింత అట్రాక్షన్ చేస్తోంది కాజల్.. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సైతం 40 లో కూడా 20లో కనిపిస్తోంది కాజల్ అంటూ ఈ వీడియోలు ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు నేటిజన్స్ . కాజల్ బ్లూ కలర్ దుస్తులలో టూ హాట్ గా కనిపిస్తూ హెయిర్ సెలూన్ ఓపెనింగ్ కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది.



అయితే ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు, నేటిజన్స్ ఇమే అందాన్ని పొగిడేస్తున్నారు. కాజల్ అప్పటికి ఇప్పటికీ తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.  కాజల్ అగర్వాల్ చివరిగా కన్నప్ప చిత్రంలో నటించింది ప్రస్తుతం ఏమే చేతిలో ఇండియన్ 3, ది ఇండియా స్టోరీ, రామాయణ పార్ట్ 1 ,2 లో కూడా నటించబోతోందట. అయితే వివాహం అనంతరం కాజల్ అగర్వాల్ కు అవకాశాలు చాలానే తగ్గిపోయాయి. అందుకే పలు రకాలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: