ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ సినిమా విజయంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మరియు దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి పారితోషికం వివరాలు ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కాంతార చాప్టర్ 1 సినిమా కోసం రిషబ్ శెట్టి ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా, ఆయన లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా తెలివైన నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సినిమా విజయవంతం కావడంతో లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా ఆయనకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో నటించిన ఇతర ప్రధాన నటీనటుల పారితోషికాల విషయానికి వస్తే, రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య, సంయుక్త గౌడ వంటి నటులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పారితోషికం దక్కినట్లు తెలుస్తోంది. 022లో విడుదలైన మరియు భారీ విజయాన్ని సాధించిన మొదటి కాంతార సినిమాకు కూడా రిషబ్ శెట్టి నాలుగు కోట్ల రూపాయలే రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని సమాచారం. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, చాప్టర్ 1 చిత్రానికి కూడా అదే మొత్తంలో పారితోషికం తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవడం అనేది ఆయన స్మార్ట్ బిజినెస్ సెన్స్కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాంతార ఫ్రాంఛైజ్ విజయ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు, లాభాల వాటా వివరాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించడం పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫామెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రిషబ్ శెట్టి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: