గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క టాపిక్‌ మోత మోగిస్తోంది . అదే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్‌ న్యూస్.  ఈ వార్త మొదట బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా కదిలిపోయింది. ఫ్యాన్స్ నుండి ఇండస్ట్రీ సర్కిల్‌ వరకు అందరూ ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇక, ఈ జంట గురించి రూమర్స్ మాత్రం కొత్తవి కావు. “గిత గోవిందం” సినిమా నుండి వీళ్ల మధ్య ఉన్న బాండింగ్‌ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఈసారి మాత్రం ఆ వార్తలు ఊహాగానాలు కాకుండా నిజంగానే మారిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి ఆధారాలే ఉన్నాయి..!


కొన్ని రోజుల క్రితం రష్మిక తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించింది. అయితే ఆ వీడియోలో అందరి దృష్టి మాత్రం ఆమె వేళ్లపై ఉన్న పెద్ద వజ్రపు ఉంగరంపైనే పడింది. ఆ రింగ్‌ కొత్తగానే కనిపించడం, పైగా ఇటీవల విజయ్ దేవరకొండ చేతిలో కూడా అదే డిజైన్‌తో ఉన్న రింగ్‌ ఫ్యాన్స్‌కి కనిపించడంతో “ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారనేది కన్‌ఫర్మ్‌!” అంటూ సోషల్ మీడియా హద్దులు దాటింది.ఫ్యాన్స్ మాత్రమే కాదు, వారి దగ్గరి బంధువులు, కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా “అవును, నిశ్చితార్థం జరిగిపోయింది” అని పరోక్షంగా ధృవీకరిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.



ఇక వీడియోను గమనిస్తే, రష్మిక కావాలనే తన చేతిని కెమెరాకి పదేపదే చూపిస్తున్నట్లుగా అనిపించింది. ఫ్యాన్స్ మాత్రం వెంటనే “అది ఎంగేజ్మెంట్ రింగ్‌ షాట్‌!” అంటూ కామెంట్స్‌తో హడావిడి చేశారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం కొత్త ఫెస్టివల్‌ లెవల్‌లో మీమ్స్‌, పోస్టులు, రియాక్షన్స్‌ వెల్లువెత్తుతున్నాయి. కొందరు సరదాగా “కొండన్న పెట్టిన రింగే చాలా పెద్దది.. పెళ్లికి ఖర్చు కూడా అంతే గ్రాండ్ గా ఉంటుంది!” అంటూ చమత్కారాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, వీరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ — వాలెంటైన్స్‌ డే రోజునే గ్రాండ్‌గా జరగబోతుందట. ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌గా, ఫ్యామిలీ మరియు కొద్ది మంది ఫ్రెండ్స్‌ మాత్రమే హాజరుకాబోతున్నట్లు టాక్‌.



ఈ జంటపై అభిమానులు చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే, రష్మిక–విజయ్‌ వెడ్డింగ్‌  టాక్‌డ్‌-అబౌట్ ఈవెంట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఫ్యాన్స్ మాత్రం ఒక్క మాటే అంటున్నారు —“హమ్మయ్య..! ఫైనల్లీ కొండన్న మన రష్మికకు పెద్దరింగే పెట్టాడు!” అంటూ సంబరాలు చేసుకుంటున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: