
అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే, లక్ష్మీ ప్రణతి మరియు ఎన్టీఆర్ జంట. ఎన్టీఆర్ ఈ వేడుకలో కొత్త లుక్‌లో కనిపిస్తూ అందరి చూపులను ఆకర్షించారు. ప్రణతి అయితే తన సొగసుతో, చీరలో ముస్తాబై.. డైమండ్ డిజైన్ మెరిసే ఆభరణాలతో అందరినీ ఫిదా చేశారు. పెళ్లి సమయానికి ఆమె స్వయంగా ప్రతి ఏర్పాటును చూసుకోవడం, కుటుంబ పెద్దలా బాధ్యత వహించడం అందరి ప్రశంసలు తెచ్చుకుంది.ఇక ఈ వేడుకలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సోషల్ మీడియాలో హాట్‌గా మారింది — అదే జూనియర్ ఎన్టీఆర్ తన బావమరిదికి ఇచ్చిన పెళ్లి గిఫ్ట్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ తన బావమరిదికి అద్భుతమైన లగ్జరీ గిఫ్ట్ ఇచ్చారట. ఆయన ఎంతో ఇష్టపడే లగ్జరీ కార్ బ్రాండ్ లోని ఒక ప్రత్యేక ఎడిషన్ వాహనాన్ని బహుమతిగా అందజేశారట. దీని ధర అక్షరాలా ఒక కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం, ఈ కార్‌ని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించారట. ఎందుకంటే బావమరిది కి కూడా కార్లపై ఎన్టీఆర్‌లాగే పిచ్చి ఉందని చెప్పుకుంటారు. ఆ కారణంగానే, “తనకి ఉపయోగపడుతుంది” అంటూ ఈ లగ్జరీ గిఫ్ట్‌ను ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్ తన ప్రేమను మరోసారి నిరూపించుకున్నాడు.
ఇక పెళ్లి వేడుకలో దగ్గుబాటి కుటుంబం కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు కుటుంబ సభ్యులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. దగ్గుబాటి ఫ్యామిలీకి, ఈ పెళ్లికూతురి కుటుంబానికి ఉన్న బంధం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది పెళ్లి వేడుక నిజంగా స్టార్ స్థాయికి తగ్గట్టుగానే జరిగిందని చెప్పాలి. పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇచ్చిన ఆ కోట్ల రూపాయల విలువ చేసే గిఫ్ట్ గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు —“ఇదే నిజమైన రాయల్టీ..!“ఎన్టీఆర్ బావమరిదికి ఇచ్చిన గిఫ్ట్ సూపర్ క్లాస్..!”అంటూ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నిజంగా చెప్పాలంటే, బంధం అంటే ప్రేమ, గౌరవం, గిఫ్ట్ కాదు — కానీ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ బహుమతి ఆయన బావమరిదిపై ఉన్న ప్రేమకు అద్దం పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు..!!