చాలామంది నటీనటులు సినిమాలు చేశాక ఆ సినిమాలో బాగుంటే పర్వాలేదు. కానీ ఆ సినిమాలు బాలేక పోతే కొంతమంది హీరో హీరోయిన్లపై నెట్టేస్తారు దర్శకనిర్మాతలు. అయితే అలా దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లపై నిందలు నెట్టేసిన సమయంలో సైలెంట్ గానే ఉంటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు వాటి గురించి స్పందిస్తూ ఉంటారు. అలా తాజాగా సల్మాన్ ఖాన్ అవకాశం రావడంతో డైరెక్టర్ కి ఇచ్చి పడేశారు.ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో డైరెక్టర్ మురగదాస్ సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ చేశారు. కానీ ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయింది.ఇక ఈ సినిమా డిజాస్టర్ తర్వాత మాదరాసి మూవీ ప్రమోషన్స్ లో సికిందర్ మూవీ ప్లాఫ్ సల్మాన్ వల్లే జరిగింది అన్నట్టు స్పందించారు. ఆ హీరో ఎప్పుడో రాత్రి 9 గంటలకు వస్తారు.ఆ టైంలో సన్నివేశాలు ఎలా చేస్తారు.పిల్లల్ని స్కూల్ కి పంపించే సీన్స్ కూడా అర్ధరాత్రి రెండు,మూడు గంటలకు చేయాల్సి వస్తుంది అన్నట్లుగా పరోక్షంగా సల్మాన్ ఖాన్ పై విమర్శలు చేశారు. 

అయితే ఈ విమర్శలకు అప్పుడు సల్మాన్ ఖాన్ ఏమీ అనకపోయినప్పటికీ తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 19 లో స్పందించారు.నాకు చాలా గాయాలయ్యాయి.బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న సమయంలో షూటింగ్ కి లేటుగా వచ్చాను. కానీ దీన్ని అలా చెప్పకుండా వేరే విధంగా నెగిటివ్గా చేసి చెప్పి నావల్లే సినిమా ప్లాఫ్ అన్నారు. ఆ డైరెక్టర్ నిర్మాత పక్కకు తప్పుకుంటే సౌత్ కి వెళ్లి వేరే హీరోతో మదరాసి సినిమా తీశారు. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్కడ హీరో సాయంత్రం 6 గంటలకే సెట్ కి వచ్చాడు. అందుకే మదరాసి మూవీ సికిందర్ మూవీ కంటే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అంటూ చురకలు అంటించారు.అయితే రాత్రి 9 గంటలకు వస్తే తన సినిమా ప్లాఫ్ అయింది అన్నారు.

మరి అక్కడి హీరో సాయంత్రం 6 గంటలకే వచ్చారా.. ఆ సినిమా ఎందుకు ప్లాఫ్ అయింది అనే విధంగా అర్థం వచ్చేలా సల్మాన్ డైరెక్టర్ కి కౌంటర్ ఇచ్చారు. అయితే మదరాసి మూవీ పెద్ద హిట్ అవుతుందని మురగదాస్ చెప్పుకొచ్చారు. కానీ ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. తమిళంలో యావరేజ్ తెలుగులో పెద్ద డిజాస్టర్. అలా సల్మాన్ ఖాన్ మురగదాస్ కి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆయన మాట్లాడిన విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: