కన్నడ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం సృష్టిస్తున్న చిత్రం కాంతార చాప్టర్1. ఈ చిత్రాన్ని హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే నటించారు. సుమారుగా మూడేళ్ల క్రితం విడుదలై భారీ సక్సెస్ అందుకున్న కాంతర చిత్రానికి ఫ్రీక్వెల్ గా తెరకెక్కించారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. అలాగే నటుడు గుల్షన్ దేవయ్య , జయరామ్ తదితర నటినటులు నటించారు అక్టోబర్ రెండవ తేదీన విడుదలైన ఈ సినిమా ఏడు భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాంతార చాప్టర్ 1 సినిమాలోని బ్రహ్మకలశం ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు.


అయితే ఇందులో ఒక చిన్న మిస్టేక్ ఉన్నట్లుగా నెటిజెన్స్ గుర్తించారు. 2022 లో వచ్చిన కాంతార చిత్రాన్ని వర్తమాన కాలంలో తీయగా, కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని 16వ శతాబ్దంలో జరిగే కథగా చూపించారు. దీంతో ఈ సినిమాలో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా చిత్ర బృంద ఆ సన్నివేశాల కోసం చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అడవిలో సెట్టింగ్స్, నటీనటుల కాస్ట్యూమ్స్ , భాష ఇలా అన్నిటిలో కూడా చక్కగా చూపించిన కానీ ఇప్పుడు ఒకచోట మాత్రం కాంతార టీమ్ చేసిన మిస్టేక్ బయటపడింది.



అసలు విషయంలోకి వెళ్తే సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే బ్రహ్మ కలశం సాంగులో గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకువెళ్లే సందర్భంగా ఈ పాట వస్తుంది. అయితే ఈ పాటలో రిషబ్ శెట్టి తమ దేవుడిని తలపై పెట్టుకుని తీసుకురావడం, నిష్ఠతో పూజలు చేయడం ఇలా అన్నీ కూడా బాగానే చూపించారు. అయితే భోజనం సమయంలో అందరూ కలిసి కింద కూర్చొని సామూహికంగానే భోజనాలు చేస్తున్న సీన్స్ లో ఒకచోట 20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్ ఉన్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇది షూటింగ్ చేస్తున్న సమయంలో తీసివేయడం  మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. బ్రహ్మ కలశ సాంగ్ లో 3:06 నిమిషాల వద్ద ఈ మిస్టేక్  గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: