
అయితే రాయుడు బ్రతికి ఉన్నప్పుడు తీసిన దాదాపుగా 20 నిమిషాల వీడియో వెలుగులోకి రావడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. కోట దంపతులను హత్య చేయాలనీ సుధీర్ రెడ్డి, ఆయన అనుచరుడు సుజీత్ రెడ్డితో చెప్పించినట్టు రాయుడు ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో వాళ్ళను చంపేందుకు రెండుసార్లు ప్రయత్నించానని రాయుడు వీడియోలో తెలిపారు.
తాజాగా వినుత ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోలో ఆమె జైలుకు వెళ్ళామనే బాధ కంటే హత్య చేశామనే బాధ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. తమది హత్యలు చేసే మనస్తత్వం కాదని నిజానిజాలు శివయ్యకు తెలుసనీ పేర్కొన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తోందని కేసు కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేనని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ వివాదం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
నాపై కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. 2024 సంవత్సరంలో కూటమి తరపున నాకు టికెట్ ఇచ్చారని కోట వినుత దంపతులు డ్రైవర్ రాయుడుని హత్య చేశారని సీసీ టీవీ ఫుటేజిలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. చెన్నై పోలీస్ కమిషనర్ కూడా వివరించారంటూ ఎమ్మెల్యే కామెంట్లు చేశారు. ఈ ఆరోపణలలో భిన్న వాదనలు నెలకొన్న నేపథ్యంలో ఎవరి వాదనల్లో నిజముందో చూడాల్సి ఉంది. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే చర్చ జరుగుతోంది.