ప్రభాస్ తన తోటి హీరోయిన్లకు ఎంత మంచి రెస్పెక్ట్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరోయిన్లతో కేవలం షూట్ వరకు మాత్రమే సన్నిహితంగా ఉంటారు.ఆ తర్వాత వారిని సొంత అక్కచెల్లెళ్లలాగే భావిస్తారు. అయితే అలాంటి ప్రభాస్ తమన్నా గురించి మాత్రం ఓ షాకింగ్ విషయాన్నీ బయట పెట్టారు. ఇక ప్రభాస్ తమన్నా కాంబినేషన్లో ఇప్పటికే బాహుబలి 1, బాహుబలి 2,రెబల్ వంటి సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల విషయం పక్కన పెడితే.. రెబల్ సినిమా సమయం లో జరిగిన ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు ప్రభాస్. రెబల్ మూవీ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.. తమన్నా ఎప్పుడూ పని.. పని.. అంటూ పనిలోనే మునిగిపోతుంది. ఆమె పని రాక్షసి.. అలాగే ఎప్పుడు చూసినా సరే మాస్టర్ తో ఆ పని చేస్తూనే ఉంటుంది అంటూ ప్రభాస్ మాట్లాడారు.

అయితే ప్రభాస్ మాటలు కాస్త వేరే విధంగా ఉండడంతో అక్కడ ఉన్న జనాలందరూ ఒకేసారి ఈలలు వేస్తూ గోల గోల చేస్తారు. ఇక వాళ్ల రియాక్షన్ కి ప్రభాస్ షాక్ అయ్యి ఇదేంటి నేనేమైనా తప్పుగా మాట్లాడానా.. ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు అంటూ ప్రభాస్ రియాక్షన్ ఇచ్చారు. అలాగే అదే ఈవెంట్లో రాఘవ లారెన్స్ తమన్నా తో పాటు నన్ను కూడా బాగానే చూపించారు అంటూ మాట్లాడారు. అయితే ఈ సినిమాలో తమన్నాని గ్లామర్ పరంగా అద్భుతంగా చూపించారు డైరెక్టర్. అందుకే ప్రభాస్ అలా ఫన్నీగా మాట్లాడి ఉంటారు.

ఇక ప్రభాస్ రెబల్ మూవీ ఈవెంట్లో తమన్నా గురించి చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో తమన్నా పని విషయంలో అంత డెడికేషన్ తో ఉంటుందా అంటూ షాక్ అవుతున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ మూవీలో తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ మూవీలో కృష్ణంరాజు కీ రోల్ పోషించారు. ఇక ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించడంతోపాటు  మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు. అలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రెబల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఫ్లాప్ అయింది అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: