
బీహార్ ఎన్నికలలో తొలిసారి తన పార్టీ జెన్ సూరజ్ బరిలోకి దింపుతున్న ప్రశాంత్ కిషోర్ తాజాగా తన రాజకీయ వ్యూహంలో భాగంగా పోటీకి దూరంగా ఉంటూ బీహార్ ఎన్నికలలో ఎన్డీయే ఓడిపోవడం ఖాయం అంటూ తెలియజేస్తున్నారు. అయితే తాజాగా ఇవాళ మరొక అంశం పై పీకే తనదైన శైలిలో జోష్యం తెలియజేశారు. తన పార్టీ సూరజ్ అయితే మాత్రం 10 సీట్ల కన్నా తక్కువే గెలుస్తుందని లేకపోతే 150 సీట్లు దాటిపోతుందంటూ ఇంటర్వ్యూలో తెలియజేశారు. తన పార్టీని నమ్మి ఓటర్లు ఓటు వేస్తే 150 సీట్లకు మించి గెలుస్తుందనే ధీమాని వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్.
తన పార్టీకి 150 సీట్లు గెలవాలనే టార్గెట్ తోనే బరిలోకి దిగుతున్నామని అంతకన్నా తక్కువ వస్తే ఓడిపోయినట్లే అంటూ తెలియజేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో నేతలలో కూడా మరింత ఉత్సాహం నింపుతున్నారు. బీహార్ ఎన్నికలలో 243 సీట్లలోను తమ పార్టీ పోటీ చేయబోతుందని ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఇలాంటి సమయంలోనే జెన్ సూరజ్ పార్టీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి. తన పార్టీ గెలిస్తే బీహార్ ప్రస్తుత దుస్థితిని అంతం చేయడానికి ఇదే సరైన మార్గమని ప్రజలు భావిస్తారని పీకే తెలియజేశారు. ఒకవేళ వారు అలా గెలిపించలేకపోతే బీహార్ పరిస్థితిని ఎవరు మార్చలేరని తెలిపారు.