తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాత బండ్ల గణేష్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన కేవలం ప్రొడ్యూసర్ గానే కాకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. అలాంటి బండ్ల గణేష్ ఏ విషయాన్ని చెప్పినా కానీ ముక్కుసూటిగా చెబుతూ ఉంటారు.  అలాంటి ఈయన  ఈ మధ్యకాలంలో తెలుసు కదా సినిమాకు సంబంధించి హైదరాబాదులో థాంక్స్ మీట్ కి ముఖ్య అతిధి గా వచ్చారు.  ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రముఖులు ఇండస్ట్రీ వ్యవస్థ గురించి ప్రతిదీ ప్రజలకు చేరవేసేది మీడియా సంస్థ.. వీరికి సినిమా వాళ్ళలాగ సెలవులు అంటూ ఉండవు.. వాళ్లు పెన్ డౌన్ చేస్తే అల్ల కల్లోలం అవుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నీరజ కోన గురించి ఆయన పలు విషయాలు బయట పెట్టారు.. 

అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈమె నేను తీసిన బాద్ షా కు స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తారు. గొప్ప కుటుంబంలో పుట్టిన ఈమె సినిమా ఇండస్ట్రీలోకి రావడం నాకే ఆశ్చర్యం వేసింది. ఇందులో నిలబడుతుందా లేదా అని అనుకున్నాను.. అయితే బాద్ షా సినిమా సమయంలోనే కాజల్ తో చాలా పరిచయం పెంచుకుంది. ఆమె ద్వారా చాలామంది హీరోయిన్లను స్నేహితులుగా చేసుకొని ఆమె కెరియర్ ను ముందుకు తీసుకెళ్లింది.

 ఒకేసారి ఇండస్ట్రీలో ఎదిగిన ఈమె ఆ తర్వాత చాలామంది హీరోయిన్లను తన చుట్టూ తిప్పుకుందని చెప్పవచ్చు. అలాంటి నీరజ స్టైలిస్ట్ గానే కాకుండా దర్శకురాలిగా కూడా మారడం చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఆమె పుట్టడమే గోల్డ్ స్పూన్ తో పుట్టింది. అలాంటి ఈమె ఇంత ఒద్దికగా సినిమా తీసింది అంటే చాలా గ్రేట్ అంటూ ప్రశంసించారు. ఈ విధంగా నీరజ కోన గురించి ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: