మరికొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న 'అఖండ 2' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జనని పాత్రలో నటిస్తున్న నటి హర్షాలీ మల్హోత్రా గురించి సినీ ప్రియులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం ఆమె అభిమానులకు మరింత ఆనందాన్ని పంచుతోంది.

బాల నటిగా 'బజరంగీ భాయీజాన్' సినిమాతో మెప్పించిన హర్షాలీకి ఆ తర్వాత హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయట. అయితే, తను మంచి పాత్ర కోసం ఎదురుచూశానని ఆమె ఇటీవల వెల్లడించారు. 'అఖండ 2' సినిమాలో జనని పాత్ర గురించి విన్న తర్వాత, "ఇలాంటి పాత్ర కోసమే కదా ఇంతకాలం ఎదురుచూశాను" అనిపించిందని ఆమె తెలిపారు.

ఈ సినిమాలో హర్షాలీ జనని అనే స్వీట్ గర్ల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు అఖండ ఆశీర్వాదాలు ఉంటాయని ఆమె తెలిపారు. జనని ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా, అఖండ కచ్చితంగా వస్తారని, అయితే "ఈ కథలో అలాంటి సందర్భం ఎందుకొచ్చింది? అఖండ వచ్చాక ఏం జరిగింది?" అనే విషయాలు ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతాయని ఆమె పేర్కొన్నారు.

నటసింహం బాలయ్య (నందమూరి బాలకృష్ణ) తనకు ధైర్యం చెప్పి, బాగా ప్రోత్సహించారని హర్షాలీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాలయ్యతో పాటు తెలుగులో తనకు అల్లు అర్జున్, ప్రభాస్ అంటే కూడా ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు. అఖండ2 సినిమాపై అంచనాలు అంతకంతకూ  పెరుగుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: