గతంలో ‘యమదొంగ’లో కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని చూపించారు జక్కన్న. అది అప్పటి టెక్నాలజీ పరిమితుల్లో చేసిన ప్రయత్నమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అది సిజిఐ యుగం… ఇది ఏఐ యుగం. ఏఐ టూల్స్ ఎంత వేగంగా, ఎంత క్వాలిటీతో విజువల్స్‌ను జనరేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న రియలిస్టిక్ ఫేస్ రీప్లేస్‌మెంట్స్ చూసి ప్రేక్షకులు కూడా అలవాటు పడిపోయారు.
ఈ క్రమంలో ‘అఖండ 2’లో ఒక పవర్‌ఫుల్ సీన్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను శివుడి రూపంలో చూపించే ప్రయత్నం జరిగిందని ఇండస్ట్రీలో బలంగా టాక్ వినిపిస్తోంది. డైలాగ్ టు డైలాగ్‌గా, షాట్ టు షాట్‌గా పేలుతున్న లీక్ వివరాలు ఈ కథనాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ ఓవైపు మేకర్స్ అంటుంటే.. మరోవైపు ఇండస్ట్రీలోని కొందరు మాత్రం “ఈసారి భారీ సర్ప్రైజ్ ఖాయం” అని బలంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఎవరూ కన్ఫర్మ్ చేయని ఈ రూమర్ ట్రూ అనుకోవాలా? లేకపోతే ఫేక్ హైప్ మాత్రమేనా? అన్నది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.
కాగా, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ `అఖండ`కు సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఇదొక ఫాంటసీ యాక్షన్ డ్రామా. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ & IVY ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీ ఆచంట, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మరో మూడు రోజుల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా అఖండ 2 రిలీజ్ కాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి