ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో శోభిత గురించి రకరకాల వార్తలు, పోస్టులు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అక్కినేని కోడలుగా ఆమెపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ఈ కుటుంబానికి ఉన్న క్రేజ్‌కు తోడు, ఇప్పుడు రాబోయే శుభవార్త కారణంగా అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త గట్టిగా వినిపిస్తోంది. అదేంటంటే, శోభిత ధూళిళిపాళ్ల ట్విన్స్ కు జన్మనివ్వబోతున్నారు అన్న ప్రచారం. ఈ న్యూస్ మీడియా సర్కిల్స్‌లో కూడా బాగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నింటిలోనూ ఈ వార్త వేగంగా వైరల్ అవుతోంది. ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, శోభిత పూర్తిగా ఆరోగ్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఆమెకు ఐదు నెలలు పూర్తైన తర్వాతే ఈ విషయాన్ని అధికారికంగా బయట పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట.
ఇప్పటికే ఈ వార్త అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అక్కినేని ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ట్రీట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు నాగచైతన్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుండగా, మరోవైపు అక్కినేని కుటుంబానికి ఇద్దరు వారసులు రాబోతున్నారు అన్న ఆనందం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.మొత్తానికి, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, నాగార్జున ఇచ్చిన చిన్న హింట్ మాత్రం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చిందనే చెప్పాలి. ఇక అభిమానులు మాత్రం ఆ శుభవార్త కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి