ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజాసాబ్' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, స్టోరీ లైన్ విషయంలో మాత్రం అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతి ఈ గందరగోళానికి తెరదించుతూ సినిమా అసలు కథాంశంపై స్పష్టతనిచ్చారు.
'ది రాజాసాబ్' ప్రధానంగా తన నానమ్మను కాపాడుకున్న ఒక మనవడి కథ అని ఆయన వెల్లడించారు. ఈ హర్రర్ ఫాంటసీ కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించడం కోసం స్క్రిప్ట్ వర్క్ కే దాదాపు ఏడాది సమయం పట్టిందని, ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కథలో బలమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయని మారుతి హింట్ ఇచ్చారు.
ప్రభాస్ తన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటారని, ముఖ్యంగా డైలాగ్స్ మరియు సన్నివేశాల్లో కొత్తదనం ఉండాలని ఆశిస్తారని మారుతి తెలిపారు. ప్రభాస్‌కు ప్రపంచ సినిమాపై అపారమైన అవగాహన ఉందని, ఆయన అభిరుచికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. హర్రర్ ఎలిమెంట్స్‌కు ఫాంటసీని జోడించి సరికొత్త జోనర్‌లో ఈ సినిమాను మారుతి తీర్చిదిద్దుతున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌కు కనువిందు చేయనుందని, డార్లింగ్ మార్క్ కామెడీతో పాటు హర్రర్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజాసాబ్ కేవలం ఒక మాస్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలు ఉన్న కథ అని, నానమ్మ-మనవడి మధ్య సాగే సన్నివేశాలు గుండెలకు హత్తుకుంటాయని మారుతి వివరించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ది రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి