చిరంజీవి గారితో సినిమా అనుకున్నాకే తనకి ఒక ఐడియా వచ్చిందని, ఆ ఐడియాతోనే 25 రోజులలోపు సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశానని ఆ సినిమానే మన శంకరవరప్రసాద్ గారు గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. ఆ స్క్రిప్ట్ 25 రోజులలోపు పూర్తి చేయడానికి ముఖ్య కారణం చిరంజీవి గారే. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఎలా ఆలోచించారో అవన్నీ కలుపుకొని ఒక స్టోరీ లాగా తీసుకుంటూ వెళ్లాను అందుకే స్క్రిప్ట్ చాలా ఫాస్ట్ గా పూర్తి అయ్యిందని ఇందులో ప్రతి సీను కూడా ఆయనదే ఆయన స్టైల్ మళ్లీ ఈ జనరేషన్ కి చూపించాను అంటూ ఈ సక్సెస్ అంతా చిరంజీవి గారికే దక్కుతుందని తెలిపారు అనిల్ రావిపూడి.
వాస్తవంగా ప్రతి ఒక్క దర్శకుడు కూడా చిరంజీవితో ఏదైనా ఒక గొప్ప హీరోయిజం సినిమాని తీసి పేరుపొందాలని చూస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలం చిరంజీవి అనే ఒక ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని అందులోనే ఒక హీరోయిజం ఉందని గ్రహించి ఆ విషయాన్ని సరిగ్గా పట్టుకున్నారు. అదే ఇప్పుడు సినిమా సక్సెస్ కి కారణమైంది. ఏది ఏమైనాప్పటికీ 25 రోజులలోనే స్క్రిప్ట్ పూర్తి చేసిన క్రెడిట్ మాత్రం అనిల్ రావిపూడికే దక్కుతుంది. అలాగే స్టార్ హీరోలను సైతం ఎలా వాడుకోవాలో కూడా అనిల్ రావిపూడిని చూసే నేర్చుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి