టాలీవుడ్ ఇండస్ట్రీలో నవీన్ పోలిశెట్టికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో నవీన్ పోలిశెట్టికి భారీ విజయాలు దక్కాయి. అనగనగా ఒకరాజు సినిమాతో నవీన్ పోలిశెట్టి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారా? సితార ఎంటర్టైనెంట్ బ్యానర్ ఫ్లాపులకు బ్రేకులు వేశాడా? దర్శకుడు మారి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడు? సంక్రాంతి సినిమాలలో అనగనగా ఒకరాజు రేంజ్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

కథ :

జమిందారీ కుటుంబంలో పుట్టిన రాజు(నవీన్ పోలిశెట్టి) ఫైనాన్షియల్ గా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు.  ఛారులతను(మీనాక్షి చౌదరి) చూసి ఇష్టపడిన రాజు కొన్ని కారణాల వల్ల ఆమెను లవ్ చేస్తాడు. అయితే రాజు, చారులత ప్రేమలో పడిన తర్వాత ఒకరి గురించి మరొకరికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి.  రాజు తన ఫైనాన్షియల్ గోల్స్ ను ఎలా సాధించాడు? రాజు ఎన్నికలపై దృష్టి పెట్టడానికి కారణమేంటి? రాజు తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే  ఈ సినిమా.

విశ్లేషణ :

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల దర్శకుడు కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. నవీన్ పోలిశెట్టి ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తారో అదే విధంగా సినిమా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి సెకండాఫ్ లో మెజారిటీ సన్నివేశాలు  కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.  సంక్రాంతి రేసులో అనగనగా ఒకరాజు కచ్చితంగా హిట్టవుతుందని ప్రేక్షకులు భావిస్తుండగా ఆ  అంచనాలే  నిజమయ్యాయి. వరుస విజయాలు సాధిస్తున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

చారులత పాత్రలో మీనాక్షి చౌదరి ఆకట్టుకున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అందుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది అనగనగా ఒకరాజు సినిమాతో  అదే మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ఫస్టాఫ్ లో కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో నవ్వించిన మరో సినిమా లేదని చెప్పవచ్చు. ఫస్టాఫ్ హిలేరియస్ గా ఉండగా సెకండాఫ్ మాత్రం మరింత బెటర్ గా ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.

నిర్మాత నాగవంశీ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా ఖర్చు విషయంలో నిర్మాత ఏ మాత్రం రాజీ పడలేదని చెప్పవచ్చు. టెక్నీకల్ గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. దర్శకుడు మారి తొలి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. భీమవరం బాల్మ సాంగ్ తెరపై కన్నుల విందులా ఉంది.  నవీన్ పోలిశెట్టి సింపుల్ స్టోరీ లైన్ నే ఎంచుకున్నా కథనం కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.

హ్యాపీ ఎండింగ్ తో ముగిసే క్లైమాక్స్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ టాప్ రేంజ్ లో ఉన్నాయి.

బలాలు : నవీన్ పోలిశెట్టి యాక్టింగ్, స్క్రీన్ ప్లే, ఫస్టాఫ్

బలహీనతలు : సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు

రేటింగ్ : 3.0/5.0  

మరింత సమాచారం తెలుసుకోండి: