కథ:
గౌతమ్ (శర్వానంద్) ప్రముఖ కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. గౌతమ్ పాస్ట్ లో దియా (సంయుక్త మీనన్) అనే అమ్మాయిని ప్రేమించి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పి ఉంటాడు. అయితే నిత్యతో (సాక్షి వైద్య) ప్రేమలో పడి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిన గౌతమ్ కు దియా వల్ల ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు గౌతమ్ తండ్రి కార్తీక్ (సీనియర్ నరేష్) లేటు వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణాలేంటి? ఆ పెళ్లి వల్ల గౌతమ్ పెళ్ళికి ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? తనకు ఎదురైన సమస్యలను గౌతమ్ ఏ విధంగా పరిష్కరించుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సామజవరగమన ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన స్ట్రెంత్ అయిన కామెడీని నమ్ముకుని రామ్ అబ్బరాజు శర్వానంద్ తో తెరకెక్కించిన నారీ నారీ నడుమ మురారి కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సంక్రాంతి రేసులో ఈ సినిమా చివరిగా విడుదలైనా శర్వానంద్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో దక్కిందని చెప్పవచ్చు.
నారీ నారీ నడుమ మురారి స్టోరీ లైన్ కొత్తది కాకపోయినా ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ను అందించే విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. గౌతమ్ పాత్రలో శర్వానంద్ అలవోకగా నటించారు. సంయుక్త మీనన్ కు ఈ సినిమాలో వేరియేషన్స్ ఉన్న పాత్ర దక్కగా సాక్షి వైద్య ఈ మూవీతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. సీనియర్ నరేష్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయింది.
ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన శ్రీవిష్ణు తన పాత్రతో ఆకట్టుకున్నారు. ఆ పాత్రకు ఉన్న డైలాగ్స్ తక్కువే అయినా ప్రతి డైలాగ్ పేలిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. శర్వానంద్ ఈ సినిమాతో సంక్రాంతి మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ప్రమోషన్స్ లో వేగం మరింత పెంచితే సంక్రాంతి సినిమాలలో టాప్2 లో ఈ సినిమా కూడా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. టెక్నీకల్ గా కూడా ఈ సినిమా బాగుంది.
నిర్మాత అనిల్ సుంకర ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఒక కాంప్లెక్స్ పాయింట్ ను తీసుకుని ఆ పాయింట్ ను ఫన్ టోన్ లో చెప్పడం ద్వారా దర్శకుడు సినిమా చూసిన ప్రేక్షకులకు పైసా వసూల్ సినిమాను చూశామనే అనుభూతిని కలిగించే విషయంలో సక్సెస్ అయ్యాడు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, బీజీఎమ్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
రేటింగ్ : 3.5/5.0
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి