ఇక నవీన్ పొలిశెట్టి విషయానికి వస్తే, 'రాజు' గారు బాక్సాఫీస్ వద్ద నిజంగానే రాజులా ఫీల్ అవుతున్నారు. మొదటి రోజు నిజాంలో ₹1.4 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా, రెండో రోజున అంతకంటే ఎక్కువగా ₹1.5 కోట్ల షేర్ సాధించి తన స్టామినాను చాటుకుంది. మొత్తంగా రెండు రోజుల్లో నిజాం ఏరియాలో ₹2.9 కోట్ల షేర్ వసూలు చేసి, ఈ సంక్రాంతికి ఒక ప్రాపర్ హిట్ బొమ్మ అనిపించుకుంది. నవీన్ కామెడీకి, మీనాక్షి చౌదరి అందానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
నారీ నారీ నడుమ మురారి: రెండు రోజుల్లో నిజాం కలెక్షన్లు దాదాపు ₹60 లక్షలు. లిమిటెడ్ స్క్రీన్స్ ఉన్నప్పటికీ ఫుల్ హౌస్ బోర్డులతో రన్ అవుతోంది.
అనగనగా ఒక రాజు: రెండు రోజుల్లో నిజాం టోటల్ ₹2.9 కోట్లు. వరల్డ్‌వైడ్ గ్రాస్ చూసుకుంటే ఈ సినిమా ఇప్పటికే ₹40 కోట్ల మార్కును దాటేసింది.
సంక్రాంతి పండుగ వేళ ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 'మురారి' మరియు 'రాజు' రెండు సినిమాల్లోనూ క్లీన్ కామెడీ ఉండటం, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అవ్వడంతో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ముఖ్యంగా నిజాం ఏరియాలో ఉన్న మల్టీప్లెక్స్‌లలో ఈ రెండు సినిమాలు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి.మొత్తానికి శర్వానంద్, నవీన్ పొలిశెట్టిలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. నిజాం బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు యంగ్ హీరోలు సృష్టిస్తున్న ఈ సందడి చూస్తుంటే, పండగ సెలవులు ముగిసినా కలెక్షన్ల జాతర మాత్రం ఆగేలా లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి