మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం దృశ్యం. మోహన్ లాల్ హీరోగా నటించారు.ఈ సినిమా తన ఫ్యామిలీ కోసం ఇంటి పెద్ద ఎంతవరకు వెళ్తారు అనే కథతో ట్విస్టులు చూపిస్తూ, కథను మలుపులు తిప్పుతూ ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేశారు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఇదే చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ కూడా దృశ్యం, దృశ్యం 2 అనే చిత్రాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. గత కొద్ది రోజులుగా దృశ్యం 3 సినిమా షూటింగ్ కూడా మొదలయ్యిందని త్వరలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మర్డర్ కేసులో హీరోకి శిక్ష పడిందా? పోలీసులకు ఏవైనా ఆధారాలు దొరికాయా? అసలు ఆ మర్డర్ కేసు ఎలా క్లోజ్ అవుతుంది అనే విషయాన్ని దృశ్యం 3లో డైరెక్టర్ చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఎలాంటి ముగింపు ఉంటుందనే విషయంపై ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఉన్నారు. తాజాగా దృశ్యం 3 విడుదల తేదీ పైన హీరో మోహన్ లాల్ తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.


ఏప్రిల్ రెండవ తేదీన దృశ్యం 3 సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి అటు అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఇదే చిత్రాన్ని వెంకటేష్ కూడా రీమేక్స్ చేయబోతున్నారు. మలయాళం లో  షూటింగ్ పూర్తి అయిన తర్వాత వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరి ఫైనల్ గా రాంబాబు పోలీసులకు చిక్కకుండా ఏం చేస్తారు అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ఇదే దృశ్యం 3 తోనే  సీక్వెల్స్ కి ముగింపు ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: