ఇటువంటి తరుణంలోనే ఆదివారం రాత్రి విజయ్,రష్మిక కలిసి జాయింట్ గా ఒక పోస్ట్ ని షేర్ చేశారు. మేము మా కోసం ఏదైనా ఎంచుకోవాలనుకునే లోపే అభిమానులే ఆ పనిని పూర్తి చేశారు. మా పెళ్లి విషయంలో అభిమానులు ఎంతో ప్రేమతో పెట్టినటువంటి పేరు "విరోష్"అనే పేరును మా వెడ్డింగ్ కార్డులో పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. అలాగే ఈ పోస్ట్ ప్రస్తుతం రాజస్థాన్లోని ఉదయపూర్ లో అత్యంత వైభవంగా ఫిబ్రవరి 26న వివాహం జరగనుందని అనంతరం అభిమానుల కోసం, సినీ ప్రముఖుల కోసం మార్చి 4వ తేదీన గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ని నిర్వహించబోతున్నామంటూ తెలియజేశారు.
గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల లో నటిస్తున్న సమయంలో ఈ జంట మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమని ఇప్పుడు నిజజీవితంలో ఏడడుగులుగా వేయబోతున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు. తమను ఇంతలా ఆదరిస్తున్న అభిమానుల కృతజ్ఞతకు ఎప్పుడు రుణపడి ఉంటామంటు ఈ జంట తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహమనంతరం ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు వినిపిస్తోంది. అటు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను విడుదల చేయబోతున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి