రకుల్ చేతులు చాచి షేక్ హ్యాండ్ ఇవ్వబోయినట్లు వీడియోలో కనిపిస్తుండగా, ఆమెను ఇగ్నోర్ చేయడంతో రకుల్ ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు జగ్గీపై విరుచుకుపడ్డారు. "స్టార్ హీరోయిన్ అని కూడా చూడకుండా అంత అహంకారం ఏంటి?" అంటూ కామెంట్లతో రచ్చ చేశారు.విషయం ముదురుతుండటంతో లక్షయ్ జగ్గీ సోషల్ మీడియా వేదికగా స్పందించి తన వెర్షన్‌ను వినిపించారు."నాకంటే ముందు ఒక పెద్ద వయసు ఆవిడ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకు వచ్చారు. ఆమె రకుల్‌కు చేయి చాపి షేక్ హ్యాండ్ ఇవ్వబోగా, రకుల్ ఆమెతో కరచాలనం చేయలేదు. అది నేను గమనించాను" అని జగ్గీ తెలిపారు.
"రకుల్ గారే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదేమో, అక్కడ ఆ పద్ధతి లేదేమో అనుకున్నాను. అందుకే నా వంతు వచ్చినప్పుడు నేను కేవలం అవార్డు తీసుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశ్యం నాకు లేదు" అని ఆయన వివరణ ఇచ్చారు.అంటే, రకుల్ అంతకుముందు చేసిన పనిని చూసి, తాను కూడా అలాగే ప్రవర్తించానని.. అది ఒక 'మిస్ అండర్‌స్టాండింగ్' మాత్రమే అని జగ్గీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. త్వరలో ఆమె ఆయుష్మాన్ ఖురానా సరసన 'పతి పత్ని ఔర్ వో డో'అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో కనిపించబోతోంది. ఈ సినిమా మే 15, 2026న విడుదల కానుంది. ఇక ఈ అవార్డు వివాదంపై రకుల్ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు.సినిమా ఇండస్ట్రీలో చిన్న విషయం కూడా ఒక్కోసారి పెద్ద వివాదానికి దారితీస్తుంది. జగ్గీ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో చర్చలు జరుపుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి