అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం పక్కా సాంప్రదాయబద్ధంగా జరిగింది.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే రామ్ చరణ్ - ఉపాసన, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, సాయి దుర్గ తేజ్, నిహారిక వంటి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు కంటి నిండా ఆనందాన్ని ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కోలీవుడ్ స్టార్ సూర్య వంటి స్టార్ హీరోలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వివాహానికి విచ్చేసి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
పెళ్లి వేడుకలో జరిగిన ఒక సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా పక్కన కూర్చున్న మెగాస్టార్ చిరంజీవి, ఆమెతో చాలా సేపు సరదాగా మాట్లాడారు. చిరంజీవి ఏదో జోక్ వేయడంతో అన్నా లెజినోవా నవ్వుతూ చిరంజీవి భుజంపై చేయి వేసి స్పందించారు. ఈ క్షణాలు అక్కడ ఉన్న కెమెరా కంటికి చిక్కాయి.పెదనాన్న, పిన్నమ్మల మధ్య ఉన్న ఈ ఆత్మీయతను చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. "మెగా ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు శిరీష్ పెళ్లిలో మెగా హీరోలంతా చేసిన రచ్చ మామూలుగా లేదు. సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ తమ డ్యాన్స్‌లతో సంగీత్ వేడుకలో సందడి చేయగా.. పెళ్లి రోజున రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.అల్లు శిరీష్ పెళ్లి ఫోటోలు మంచి ఫీస్ట్ లాంటివని చెప్పొచ్చు. అల్లు శిరీష్ - నయనికా రెడ్డి జంట కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ నెటిజన్లు విషెస్ చెప్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి