బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన సీక్వెల్‌గా ‘ధురంధర్ : ది రివెంజ్’ నిలుస్తోంది. స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. మొదటి భాగమైన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని రీతిలో సంచలన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌లో ఒక కొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు వస్తున్న సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్, ఇంటెన్స్ డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. కథలో ఎక్కడా బోరింగ్ అనిపించకుండా, ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

ట్రైలర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనతో పాటు సినిమా మీదున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించారు. ఈ ప్రీమియర్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోల కోసం సుమారు రెండు లక్షల టికెట్లు బుక్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది బాలీవుడ్‌లో అరుదుగా కనిపించే రికార్డుగా చెప్పాలి. ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రేడ్ విశ్లేషకులు ఓపెనింగ్ డే కలెక్షన్స్‌పై భారీ అంచనాలు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ‘ధురంధర్ : ది రివెంజ్’ బాలీవుడ్ చరిత్రలో మరో కొత్త రికార్డు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ప్రముఖ నటులు అర్జున్ రాంపాల్,సంజయ్ దత్ మరియు సార అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్రలు కూడా కథలో ఎంతో కీలకంగా ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా యాక్షన్, డ్రామా, ఎమోషన్ అన్నీ సమతూకంగా ఉండేలా దర్శకుడు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఏర్పడిన హైప్‌ను చూస్తే, విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఈ సినిమాకు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: