కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన సూర్య నటిస్తున్న 45వ సినిమా కురుప్పు.ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమంలో ఈ సినిమా విడుదల హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా యాక్షన్ ఫాంటసీ అంశాలతో తెరకెక్కించగా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన ఇంకా విడుదల కాకపోవడంతో ఈ సినిమా పైన పలు రకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్, ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు.


ఇందులో సూర్యకి జోడిగా త్రిష నటిస్తూ ఉండగా, సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించారు. 2025 నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయినట్లు సమాచారం. నిర్మాత ఎస్ఆర్ ప్రభు, హీరో సూర్య పైన  డైరెక్టర్ ఆర్జే బాలాజీ కేసు వేయాలని భావిస్తున్నట్లు తమిళ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమా పూర్తి అయిన వ్యక్తిగత కారణాలవల్ల నిర్మాతసినిమా విడుదల విషయంలో ఆలస్యం చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ అర్జే బాలాజీ కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, ఓటీటి డీల్ క్లోజ్ అయిన తర్వాతే సెటిల్ చేస్తామంటూ నిర్మాత చెప్పడని , దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తయని వినిపిస్తున్నాయి.


కురుప్పు సినిమా ఆలస్యం వల్ల డైరెక్టర్ కెరీర్ కి నష్టం జరుగుతోందని, ఈ సినిమా కోసం సూర్య పడిన కష్టం అంతా వృధా అవుతూ ఉందంటూ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ మరొకవైపు వినిపిస్తున్న విషయమేమిటంటే డైరెక్టర్ అర్జే బాలాజీ కి నిర్మాతలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కావాలనే కొంతమంది ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై అటు చిత్ర బృందం కానీ హీరో సూర్య గాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలాగే సినిమా విడుదల తేదీ పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: