హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన దసరా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తిరుపతిలో జరిగిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం వార్షికోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పాల్గొన్నారు.


ప్యారడైజ్ సినిమాలో  మోహన్ బాబు చేస్తున్న పాత్ర పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ నటుడుగా మోహన్ బాబు గారికి అసలైన సామర్థ్యం ఇప్పటి ప్రేక్షకులకు పూర్తిగా అవగాహన లేదు మనం ఎప్పటినుంచో ఆయలో విలక్షణమైన నటుడిని మిస్ అవుతున్నాము. ఆయనలోని అసలైన విశ్వరూపాన్ని పారడైజ్ సినిమాలో వెండితెర పైన ఆవిష్కరించబోతున్నానని తెలిపారు. ఇంతకంటే ఎక్కువగా ఇప్పుడు చెప్పలేను, ట్రైలర్ టీజర్ రిలీజ్ అయ్యాక మీకే అర్థమవుతుందని తెలియజేశారు.


ప్యారడైజ్  సినిమాలో మోహన్ బాబు షికంజా మాలిక్ అనే ఒక భయంకరమైన ప్రతి నాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వైలెన్స్ ని మరింత చూపించేలా కనిపిస్తోంది. నానికి జోడిగా కాయాదు లోహర్ నటిస్తోంది. అలాగే సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితర నటి నటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. మోహన్ బాబు, నాని మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. మరి ట్రైలర్ టీజర్ తో ఎలాంటి అంచనాలను పెంచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: