ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉన్నాయి.గాలిలో ఎగురుతున్న విమానంలో (Mid-air Flight Action) ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారట. ఇది కేవలం ఫైట్ మాత్రమే కాదు, సినిమా కథను మలుపు తిప్పే ఒక ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ ట్విస్ట్ అని సమాచారం.
కేజీఎఫ్‌లో ఇంటర్వెల్ సీన్‌తో థియేటర్లను ఊపేసిన నీల్, ‘డ్రాగన్’లో అంతకు మించిన షాకింగ్ ఎలిమెంట్స్‌ను సిద్ధం చేశారట.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో సాధారణంగా కనిపించే డార్క్ టోన్, డస్ట్ మరియు గ్రే కలర్ థీమ్ ఈ సినిమాలో ఉండబోవట్లేదట. ఈసారి నీల్ పూర్తి భిన్నంగా ‘కలర్‌ఫుల్ విజువల్ ప్యాలెట్’ను ఎంచుకున్నట్లు టాక్. ఇది ఆయన మేకింగ్ స్టైల్‌లో ఒక భారీ మార్పుగా భావించవచ్చు. ఈ క్రేజీ ప్రాజెక్టులో ‘సప్త సాగరదాచై ఎల్లో’ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ మార్కెట్లను కూడా టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా లెవల్లో ఈ ‘డ్రాగన్’ గర్జించబోతోంది.మొత్తానికి, యాక్షన్, స్క్రీన్‌ప్లే, విజువల్ స్టైల్ ఛేంజెస్, భారీ నిర్మాణ విలువలు.. అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి