ఈ సినిమా పైన అనుష్క అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. మలయాళ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో ఎక్కువగా విభిన్నమైన కథలతో బాగానే పేరు సంపాదించింది. ఇప్పుడు అదే బాటలో కథనార్ అనే భారీ బడ్జెట్ సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే మేకర్స్ విడుదల చేయగా, ట్రైలర్ చాలా విభిన్నంగా సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లేలా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుంచి ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునేలా డార్క్ మరియు విజువల్స్ తో సరికొత్తగా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.
అయితే ఈ కల్పిత ప్రపంచాన్ని సృష్టించడానికి చిత్ర బృందం చాలానే కష్టపడినట్లు ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. భారతీయ సినిమాలలో విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కువగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. కానీ కథనార్ చిత్రం విమర్శలకు చెక్ పెట్టబోతోంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు కూడా మిస్టరీ మరియు ఉత్కంఠతను మరింత రెట్టింపు చేసేలా కనిపిస్తోంది. ఒక రొటీన్ మాంత్రికుడి కథలా కాకుండా చాలా వైవిద్యమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కొనసాగేలా కనిపిస్తోంది. ఈ సినిమా భారతీయ జానపద కథలకు ఆధునిక సాంకేతికను జోడించి తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో జయసూర్య సరసన అనుష్క శెట్టి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అనుష్క నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ సినిమాతో అనుష్క మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి