సాధారణంగా సెలబ్రిటీలు తమపై వచ్చే రూమర్లను లైట్ తీసుకుంటారు లేదా సీరియస్‌గా లీగల్ నోటీసులు పంపిస్తారు. కానీ త్రిష మాత్రం రూమర్ రాయుళ్ల పరువు తీసేలా ఓ రేంజ్‌లో సెటైర్లు వేసింది.“నేను సినిమాలకు గుడ్‌బై చెప్పేశానట.. ఓ రిచ్ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నానట.. అంతేకాదు, మాకు పుట్టిన నలుగురు పిల్లలకు నిన్నే రెండేళ్లు కూడా నిండాయట.. ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తవి యాడ్ చేయాలా? లేదా ఈ రోజుకి ఈ కల్పిత కథల కోటా పూర్తయిందా?” అంటూ త్రిష పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సునామీ సృష్టిస్తోంది. తనపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ ఎవరో కావాలని క్రియేట్ చేస్తున్న ‘స్క్రిప్ట్’ మాత్రమేనని త్రిష పరోక్షంగా తేల్చిచెప్పింది. ‘క్వీన్’ ఇచ్చిన ఈ అదిరిపోయే కౌంటర్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
రూమర్లు ఎలా ఉన్నా, త్రిష కెరీర్ మాత్రం ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.చిరంజీవి గారి సోషియో ఫాంటసీ మూవీ‘విశ్వంభర’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ‘స్టాలిన్’ జోడీ మళ్ళీ వెండితెరపై కనిపించబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.కమల్ హాసన్ -మణిరత్నం కాంబోలో వస్తున్న ‘థగ్ లైఫ్’ తో పాటు పలు భారీ చిత్రాల్లో త్రిష నటిస్తోంది. చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ, పెళ్లి గురించి ఆలోచించే తీరిక కూడా లేదని తన పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి