నిన్న సాయంత్రం కొన్ని సీన్లు బయటకు వచ్చినప్పుడే చిత్ర యూనిట్ అలర్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎవరూ షేర్ చేయవద్దని హెచ్చరించింది. కానీ దురదృష్టవశాత్తు, కొద్ది గంటల్లోనే పూర్తి సినిమా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. వినోత్ మార్క్ మేకింగ్‌తో, విజయ్ మాస్ డైలాగులతో దద్దరిల్లిపోవాల్సిన థియేటర్ల కంటే ముందే మొబైల్ ఫోన్లలో ఈ విజువల్స్ రావడం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది.
పవన్ కళ్యాణ్ సీన్ రిపీట్ అవుతుందా?
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. సినిమా విడుదలకు ముందే లీక్ అయినా, అభిమానులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టి ఇండస్ట్రీ హిట్ చేశారు. ఇప్పుడు విజయ్ అభిమానులు కూడా అదే కసిని చూపిస్తారని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. "లీక్ చేసినోడు పైరసీ చేయగలడు కానీ.. థియేటర్లో దళపతి ఇచ్చే హైని, ఆ గోలని ఎక్కడి నుంచి తెస్తాడు?" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు.
అభిమానులకు విజ్ఞప్తి: దళపతి కోసం ఒక్కసారి ఆలోచించండి!
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడటం, ఇంకా సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడం ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. సెన్సార్ బోర్డు త్వరగా స్పందించి క్లియరెన్స్ ఇస్తే, వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి నష్టాన్ని అడ్డుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రం కేవలం సినిమా మాత్రమే కాదు, విజయ్ రాజకీయ ప్రస్థానానికి ఒక బలమైన పునాది వంటిది.ఒక నటుడు తన రెండు దశాబ్దాల కెరీర్‌ను ముగిస్తూ ఇస్తున్న 'ఫేర్‌వెల్' గిఫ్ట్ ఈ సినిమా. వేల మంది కార్మికుల కష్టం, నిర్మాతల కోట్లాది రూపాయల పెట్టుబడి ఇందులో ఉంది. మొబైల్ ఫోన్లలో పైరసీ ప్రింట్లు చూసి దళపతికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించకండి. సినిమాలోని అసలైన కిక్ కావాలంటే బిగ్ స్క్రీన్ పైనే చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి