ప్రస్తుతం ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఆమె ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న అటు సినిఅభిమానులు, సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆశా బోస్లే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె మనవరాలు జూనై బోస్లే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మా అమ్మమ్మ ఆశ బోస్లే తీవ్రమైన అలసట, చాతి ఇన్ఫెక్షన్ వల్ల ఆసుపత్రిలో చేరారని దయచేసి మా గోప్యతకు కొంత విలువ ఇవ్వాలి అంటు కోరుతున్నానని తెలియజేసింది".
అంతేకాకుండా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ఆశా భోస్లే మనవరాలు రాసుకుంది. ఇందుకు సంబంధించి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1950 వ దశకంలో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆశా భోస్లే 1952లో సంగ్దిల్ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతో మంది అగ్ర దర్శకుల దృష్టిని ఆకర్షించి తలుచిత్రాలలో పాటలు పాడింది. 90వ దశకంలో రంగీలా చిత్రంతో కూడా కుర్రకారులను తన సంగీతంతో ఆకట్టుకుంది. ఇవే కాకుండా ఎన్నో పాటలు తన కెరియర్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆశా భోస్లే మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి