ఈ విషయం మీద కూడా చాలామంది నెటిజెన్స్ అనసూయను వక్రీకరిస్తూ.. శివాజీ భయానికి అనసూయ ఇలా మారిపోయింది అంటూ చాలా కామెంట్స్ చేశారు. తనపై వస్తున్న ఇలాంటి వార్తలను అనసూయ తిప్పికొట్టింది. శివాజీ సృష్టించిన చీరను అనసూయ ధరించిందని థంబ్ నెయిల్ పెట్టుకుంటే బాగుంటుందని, తాము గతంలో ఎప్పుడూ కూడా చీరలు కట్టుకోనట్లుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉండడం చూసి నవ్వువోస్తోంది. ఏదైనా ప్రచారం చేసే ముందు అసలు నిజాలు తెలుసుకోవాలంటు తెలియజేసింది. సాధారణంగా పండుగలు, గుడి సందర్భాల సమయంలో తాను ఎప్పుడు కూడా సాంప్రదాయంగానే కనిపిస్తానంటూ మరొకసారి గుర్తు చేశారు.
ఇందుకు సంబంధించిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా అనసూయ ఎన్నో సందర్భాలలో చీరకట్టులో కనిపించిన ఫోటోలు చూసే ఉన్నాము. వస్త్రధారణ అనేది వ్యక్తిగత ఇష్టమని దానిని ఎవరు కూడా మరొకరి వ్యాఖ్యలతో ముడి పెట్టడం సరికాదు అంటూ అనసూయ అభిమానులు కూడా అభిప్రాయపడుతూ మద్దతు నిలుస్తున్నారు. గత కొద్ది నెలలుగా శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్ పైన చేసిన కామెంట్స్ గురించి ఎవరూ కూడా మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు మరొకసారి అనసూయ చేసిన ఈ కామెంట్స్ వల్ల ఇప్పుడు చర్చ జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి