టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య పలు చిత్రాలలో విలన్ గా కనిపిస్తూనే మరికొన్ని చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. అయితే సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా తమ పిల్లలతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు మంచు ఫ్యామిలీ. అంతేకాకుండా షూటింగ్ సమయాలలో అవకాశం ఉంటే చాలు పిల్లలను సినిమా సెట్స్ కి తీసుకువెళ్లి అక్కడ సందడి చేస్తూ ఉంటారు. బయటకాని సినిమాలో కానీ కాస్త గంభీరంగా ఉండే మోహన్ బాబు పిల్లల దగ్గరికు వచ్చేసరికి మాత్రం ఫన్నీగా మారిపోతారు.


అందుకే మంచు కుటుంబంలో తాతయ్య(మోహన్ బాబు) పిల్లలకు చాలా ఇష్టము. ముఖ్యంగా అవ్రామ్ అయితే తాతయ్య అని ఆట పట్టిస్తున్న సందర్భాలు చాలానే చూశాము. తాజాగా తన తాతయ్యకే వార్నింగ్ ఇస్తూ మోహన్ బాబు ,మంచు విష్ణు ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా.. అవ్రామ్ వచ్చి అల్లరి చేస్తుంటారు. అది చూసిన మోహన్ బాబు కామ్ గా ఉండు అల్లరి చేయొద్దు అనడంతో.. అవ్రామ్ ఏ బాబు అంటూ మోహన్ బాబు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి బెదిరిస్తున్నట్టు ఫన్నీగా ఈ వీడియోని మంచు విష్ణు తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.


ఇక తన మనవడి అల్లరి తట్టుకోలేక చివరికి మోహన్ బాబాయ్ సైలెంట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో షేర్ చేయగా అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. గత ఏడాది కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు, మోహన్ బాబు ఇద్దరూ కూడా కలిసి కనిపించారు. ఇక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే హీరో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో విలన్ గా నటిస్తూ ఉండగా ,ఇప్పటివరకు మోహన్ బాబు కెరియర్ లో చూడని పాత్రలో కనిపించబోతున్నారట. అలాగే శ్రీనివాస మంగాపురం చిత్రంలో కూడా మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: