బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించిన దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ తమ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలియజేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో మొదటి సంతానం దువా కు జన్మనిచ్చిన ఈ జంట ఇప్పుడు సరిగ్గా ఏడాది తిరగకముందే మరోసారి ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్లో సంచలనంగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీని పలు రకాల ఫోటో షూట్లతో ప్రకటిస్తూ ఉంటారు. కానీ దీపికా పదుకొనే మాత్రం చాలా డిఫరెంట్ గానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.



తన ఇంస్టాగ్రామ్ లో ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ అందులో వారి కూతురు దువా చేతిలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్టు  పట్టుకొని మరి నిలబడింది. రణ్ వీర్, దీపికా ఇద్దరు కూడా తమ కూతురు చేతులను ఆప్యాయంగా పట్టుకున్నట్టుగా ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఈ వార్త బయటికి రాగానే క్షణాలలో వైరల్ గా మారింది.. ఈ విషయం విన్న అటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీలు హార్ట్ ఎమోజిలతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.


దీపికా పదుకొనే రెండోసారి ప్రెగ్నెన్సీ కారణంగా తన కెరియర్ ప్లానింగ్ లో కొన్ని మార్పులు చేసుకున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే నాగ్ అశ్విని తెరకెక్కిస్తున్న కల్కి 2 చిత్రంలో నటించలేదు. అలాగే సందీప్ రెడ్డి ,ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్నది. కానీ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా సినిమాలో మాత్రం ఈమె హీరోయిన్గా నటిస్తోంది. సినిమా షూటింగ్ టైమింగ్ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టిందని అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా పలు రకాల కండిషన్స్ పెట్టిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఏది ఏమైనాప్పటికీ దీపికా, రణ్ వీర్ సింగ్ తమ జీవితంలో పక్క ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: