ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మాత్రమే. ‘సలార్’తో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించిన నీల్, ఇప్పుడు తారక్‌తో అంతకు మించిన ఊచకోతను ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్ మరియు రిలీజ్ డేట్ ప్రకటనతో సోషల్ మీడియా షేక్ అవ్వగా, ఇప్పుడు షూటింగ్ సెట్స్ నుంచి బయటకు వచ్చిన కొన్ని లీక్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.


సినిమా మేకర్స్ ఎక్కడా చిన్న సమాచారం కూడా బయటకు రాకుండా కోట గోడల మధ్య షూటింగ్ నిర్వహిస్తున్నారు. కానీ తాజాగా శాంటో అనే విదేశీ యాక్షన్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కండలు తిరిగిన భారీ కాయం కలిగిన యాక్షన్ ఆర్టిస్టులు సెట్స్ నుంచి పోస్ట్ చేసిన విజువల్స్ చూస్తుంటే, ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో తారక్‌తో ఊహించని ‘యాక్షన్ ఫీస్ట్’ రెడీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించబోతున్నారు. తారక్ తన బాడీని చాలా స్లీక్ గా మరియు పవర్‌ఫుల్ గా మార్చుకున్నారు. ఈ ‘జిమ్ బాడీ’తో అంతటి భారీ విదేశీ నటులను తారక్ ఢీకొనే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ షేడ్ విజువల్స్‌లో తారక్ గర్జన చూస్తుంటే థియేటర్లలో రికార్డులు తిరగరాయడం ఖాయం అనిపిస్తోంది.


కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తన కథలో హీరోయిన్ పాత్రకు కూడా బలమైన ఎమోషన్‌ను జోడిస్తారు. యాక్షన్ ఒక ఎత్తయితే, తారక్ మరియు రుక్మిణి మధ్య వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు అని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఈ లీక్డ్ విజువల్స్ తో మరో లెవల్‌కు చేరుకున్నాయి.ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ అంటేనే మాస్ జాతర. ఈ ఇద్దరి కాంబోలో రాబోయే యాక్షన్ సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని విధంగా ఉంటాయని శాంటో షేర్ చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. లీక్స్ విషయంలో మేకర్స్ కఠినంగా ఉన్నా, ఇలాంటి అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో సినిమా పట్ల క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: