హైదరాబాద్ షేక్ పేటకు చెందిన వై.వి ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 2018లో ఇండియాకు వచ్చిన సమయంలోనే అషు రెడ్డి తో పరిచయం ఏర్పడిందని అమెరికాలో తన చదువు పూర్తి చేసి సినిమాలలో అవకాశం కోసం హైదరాబాద్ కి వచ్చానని తెలిపిందని కంప్లైంట్ లో తెలియజేశారు. అలా పరిచయమైన కొద్ది రోజులలోనే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని తనని నమ్మించి ఆర్థికంగా అవసరాల పేరుతో డబ్బులను అడుగుతూ బంగారం ఆస్తులు కారు వంటివి కొనుగోలు చేసిందని , ఇలా చాలా వాటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఫిర్యాదులో తెలియజేశారు ధర్మేంద్ర.
అషు రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పేరుతో హడావిడి చేసి కొన్ని రోజుల తర్వాత ముఖం చాటేసారని ఫిర్యాదులో తెలియజేశారు. 2025 వరకు తన కుమారుడు నుంచి సుమారుగా రూ. 9.35 కోట్ల రూపాయలు అషు రెడ్డి తీసుకుందంటూ ధర్మేంద్ర తండ్రి కూడా తెలియజేస్తున్నారు. అలా రూ .35 కోట్ల రూపాయలు విలువ చేసే నగదు, సుమారుగా 5 కిలోల బంగారం, కార్లు ఫ్లాటు వంటివి కొనుగోలు చేసిందని తెలియజేశారు. మరి ఈ విషయం పైన అషు రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి